విజయవాడ (Vijayavada) : ఏపీలో రోడ్ల AP Road మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 274 రహదారుల మరమ్మతుల కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ హైవేస్ లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రహదారుల్లో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో (krishna District) ఎనిమిది రాష్ట్ర రహదారులు, ఎనిమిది మేజర్ జిల్లా రహదారుల్లో గుంతలు పూడ్చడం, పూర్తిగా ధ్వంసమైన చోట రోడ్డు అభివృద్ధి చేసేందుకు రూ.108.7 కోట్లు మంజూరు చేసింది. రెండు విభాగాల్లో కలిపి 68.8 కిలోమీటర్ల మేర రహదారులు బాగు చేయనున్నారు. రాష్ట్ర రహదారుల (Road) విభాగంలో 52.3 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.36.8 కోట్లు, మేజర్ జిల్లా రహదారుల విభాగంలో 56.4 కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ.31.7 కోట్లు మంజూరు చేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్ట్ పట్టాలెక్కించేలా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
Rain Alert : మరో అల్పపీడనం తెలంగాణ కి భారీ వర్ష సూచన
AP Road Repair
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రహదారి భవనాల శాఖ పరిధిలోని రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,104 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయిస్తూ బుధవారం పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలో రాష్ట్ర, నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ హైవేస్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రహదారుల్లో 166 పనులకు రూ.600 కోట్లు మేజరు జిల్లా రహదారుల అభివృద్ధికి అదనపు ప్రణాళిక కింద నిధులు మంజూరు చేసింది. 27 రహదారులను 161.781 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.90.25 కోట్లుకేటాయించింది. తాజాగా ఈ ఏడాదిలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నాబార్డు కింద, ప్లాన్ గ్రాంటుగా రోడ్ల AP Road అభివృద్ధికి రూ.88 కోట్లు మంజూరు చేసింది. వీటిలో నాబార్డు పనులకు టెండర్లు, ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్లాన్ గ్రాంటు పనులకు టెండర్లు పూర్తి కాగా, ఇవి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. ఈ పనులు వచ్చే నెలలో చేపట్టే అవకాశం ఉంది. అదనపు ప్లాన్ కింద మంజూరు చేసిన నిధులకు సంబంధించిన పనులకు వచ్చే నెలలో టెండర్లు ప్రక్రియ చేపడతామని కాకినాడ సర్కిల్ఆర్అండ్ ్బ ఎస్ఈ జి.కంఠు తెలియజేశారు. రానున్న వేసవి నాటికి జిల్లాలోని రాష్ట్ర రహదారులు, మేజరు జిల్లా రహదారులు పూర్తి స్థాయిలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలోని గుంతలు పూడ్చేందుకు వార్షిక ప్రణాళిక కింద రూ.40 కోట్లు ప్రతిపాదనలు పంపామని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: