AP Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం

Read Time:  1 min
AP Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం
FONT SIZE
GET APP

AP Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ, సెలవుపై సొంత గ్రామానికి వచ్చిన ఒక ఆర్మీ జవాన్ (Army jawan) రోడ్డు ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడు మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన చంద్రమౌళి ఆయన 2017లో భారత సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు.

Read Also: CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

AP Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం
AP Road Accident: Army jawan dies in road accident

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

ఇటీవల సెలవుపై తన స్వగ్రామానికి వచ్చారు. గురువారం ఒక శుభకార్యానికి హాజరై, తిరిగి ఇంటికి వస్తుండగా గురుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలోని ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనం చంద్రమౌళి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తీవ్రతకు చంద్రమౌళి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చిన్న వయసులోనే ఆర్మీలో చేరి, ఉన్నత స్థాయిలో ఉండాల్సిన యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో శిఖబడి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందిన కొడుకు దేశ సేవలో ఉండి, సెలవుకు వచ్చి ఇలా శవమై పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.