📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: AP: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Rajitha
Updated: November 13, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: శ్రీకాకుళం : ఆర్జీయు (RGUKT) కెటి, శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ప్రత్తి పాటి సృజన్ (20) బుధవారం హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పాత గుంటూరు పట్టణంలో ఎటి అగ్రహారం నాలుగో లైన్ కు చెందిన సృజన్ 2021-22 విద్యా సంవత్సరంలో ఈ క్యాంపస్ లో చేరాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఇంజనీరింగ్ ఇఇఇ బ్రాంచ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం క్యాంపస్ లో ఇంజ నీరింగ్ విద్యార్థులకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతు న్నాయి. తోటి విద్యార్థులంతా మిడ్ పరీక్షలు రాసేందుకు వెళ్లగా సృజన్ మాత్రం బాలుర హాస్టల్ తాను ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు దిగి తన స్నేహితుని గదిలో ఫ్యాన్ కు తాడు బిగించి ఉరిపోసుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో హాస్టల్ గదికి వచ్చి తోటి విద్యార్థులు చూసేసరికి తలుపులు మూసి ఉండగా, కిటికిలోంచి చూడగా సృజన్ ఫ్యాన్కు వ్రేలాడి ఉన్నట్టు విద్యార్థులు గుర్తించారు.

Read also: Puttaparthi: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

AP: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి సృజన్ మృతిపై పలు అనుమానాలు

AP: ఈ విషయాన్ని విద్యార్థులు క్యాంపస్ అధికారులకు సమాచారం ఇవ్వగా, తలుపులు పగలుగొట్టి చూశారు. సృజన్ ను క్యాంపస్ కు చెందిన అంబులెన్స్ లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీ లించారు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన సృజన్ తండ్రి కృష్ణప్రసాద్ ఆటో డ్రైవర్ కాగా, తల్లి జ్యోతి గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు సంతానం, కాగా, వీరిలో సృజన తో పాటు సోదరి ఉన్నారు. విద్యార్థి సృజన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తృతీయ సంవత్సరం చదువుతున్న ఈ ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి చూపేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఆత్మ హత్యకు గల కారణాలపై పూర్తిస్థాయి పోలీసులు దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్ లో విద్యార్థి సృజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు క్యాంపస్ సందర్శించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. విద్యార్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh latest news RGUKTSrikakulam StudentSuicide Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.