ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP) రైతులకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తున్న భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రెవెన్యూ క్లినిక్‌లు అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ క్లినిక్‌లు మంచి ఫలితాలు ఇవ్వడంతో, వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజల అర్జీలకు పారదర్శకంగా, బాధ్యతతో పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే నాడు కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. భూ వివాదాలు సహా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఈ క్లినిక్‌ల ద్వారా పరిష్కరించనున్నారు. అలాగే సాధారణ రోజుల్లో కలెక్టరేట్‌కు వచ్చే వినతులనూ ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.
Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
పారదర్శకత, వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా కొత్త విధానం
పట్టాదారు పాస్‌బుక్, 1/70 కేసులు, ఆర్‌ఓఆర్, (Record of Rights) ఆర్‌ఓఎఫ్‌ఆర్(Record of Forest Rights), రీ సర్వే వంటి మొత్తం 14 రకాల భూ సమస్యలుగా అర్జీలను విభజించాలి. (AP) ప్రతి సమస్య రకానికి ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేసి, అక్కడ సిబ్బందిని నియమిస్తారు. అర్జీదారు సమస్యకు సంబంధించిన టేబుల్‌కు నేరుగా వెళ్లేలా మార్గనిర్దేశం చేస్తారు. ప్రతి అర్జీకి ప్రత్యేక ఆన్‌లైన్ నంబర్ కేటాయించడంతో పాటు, దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్, ఆధార్ వివరాలను కూడా నమోదు చేస్తారు. అర్జీని స్వీకరింనచినకా సమస్య పరిష్కారానికి చేపట్టే చర్యల వివరాలతో కూడిన ధ్రువీకృత కాపీని దరఖాస్తుదారునికి అందజేస్తారు. ఇందులో సమస్య తీవ్రత, పరిష్కారానికి పడే అంచనా సమయం వంటి అంశాలు ఉంటాయి. దీనిపై డిప్యూటీ కలెక్టర్ సంతకం చేస్తారు. వీలైనంతవరకు ఒక్కరోజులోనే సమస్యను పరిష్కరించాలనే ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. అది సాధ్యంకాకపోతే, నిర్దిష్ట గడువు నిర్ణయించి ఆలోపే పరిష్కారం చూపాలని సూచించింది.
మొదట డెస్క్ స్థాయిలో అర్జీని పరిశీలించి, సంబంధిత తహసీల్దార్‌కు పంపిస్తారు. ఫీల్డ్ పరిశీలన, ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం సమస్యకు తుది పరిష్కారం అందిస్తారు. సమస్య పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయాలను ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు అమలు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న ముస్తాబు కార్యక్రమంతో పాటు ఈ కొత్త విధానం కూడా జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: