📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

AP: స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన రవి నాయుడు

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలోని క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారికి సరైన వసతులు, శిక్షణ అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది కేవలం భవనాల నిర్మాణమే కాకుండా, భవిష్యత్ క్రీడాకారులకు బలమైన పునాదిని వేయడంగా ప్రభుత్వం భావిస్తోంది.

Read also: Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు

ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో క్రీడారంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తిరుపతిలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ నిర్మిస్తోంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో ఈ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తున్నారు.రూ.5 కోట్ల వ్యయంతో తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు.. తిరుపతిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటియాలా తర్వాత తిరుపతిలోని స్పోర్ట్స్ అకాడమీ సమగ్ర శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. 200 మంది క్రీడాకారులకు వసతి కల్పించేలా వసతి గృహం, జాతీయ ప్రమాణాలతో వెయిట్ లిఫ్టింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, బ్యాడ్మింటన్, జూడో, లాన్ టెన్నిస్, చెస్ వంటి ఆటల కోసం ఇండోర్, అవుట్ డోర్ సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.

AP: Ravi Naidu performed the ground breaking ceremony for the construction of the Sports Academy

మల్టీ స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ

జూన్ నాటికి ఈ అకాడమీని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.క్రీడారంగం అభివృద్ధికి, యువ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసే మల్టీ స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ.. ఆధునిక వసతులతో, ప్రొఫెషనల్ కోచింగ్‌తో సమగ్ర శిక్షణ అందిస్తుందని రవి నాయుడు వివరించారు. రాష్ట్రం నుంచి భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేసేందుకుఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీ జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Sports Development AP government sports initiatives latest news Ravi Naidu Telugu News Tirupati sports academy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.