AP Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు (Ration Card) కలిగి ఉన్న లబ్ధిదారులకు, కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే వారికి కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రేషన్ కార్డులలో పేర్ల చేర్పులు, తొలగింపులు, కార్డుల విభజన (Splitting) వంటి ప్రక్రియలను ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా అత్యంత సులభంగా చేసుకునేలా సేవలను మెరుగుపరచాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజీఎస్ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్‌బీజీఎస్ (RBGS) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్టీజీఎస్ సేవలపై శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance) విప్లవం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
- ఇంటి వద్దనే రేషన్, ఆధార్ సేవలు: ఇకపై రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అలాగే ఆధార్ కార్డు (Aadhaar Card) అప్‌డేట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లేదా నేరుగా వాట్సప్ గవర్నెన్స్ సేవలను ఉపయోగించి ఇంటి వద్ద నుంచే ఈ మొబైల్ సేవలను సులభంగా పొందవచ్చు.
- నెల రోజుల పాటు అవగాహన సదస్సులు: ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ సేవలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి మరియు ప్రతి ఒక్కరూ దీనిని విస్తృతంగా ఉపయోగించుకునేలా చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలను వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానించడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు.
AP Ration Card: కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ సులభతరం
ప్రజలకు అత్యంత అవసరమైన సర్టిఫికేట్ల జారీలో ఉన్న రెడ్-టేపిజం (అడ్డంకులను) తొలగించాలని లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి సమీక్షా ముఖ్యాంశాలు – ఆదేశాలు
- సర్టిఫికేట్ల స్పీడ్ అప్: ఇన్‌కమ్ సర్టిఫికేట్ (Income Certificate), క్యాస్ట్ సర్టిఫికేట్ (Caste Certificate) వంటి కీలక పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను వెంటనే తొలగించి, ప్రజలకు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలి.
- డేటాలేక్ పనులకు డెడ్‌లైన్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డేటాలేక్’ (Data Lake) పనులను జూలై (2026) నాటికి వంద శాతం పూర్తి చేయాలి.
- డిజి వెరిఫైడ్ సర్టిఫికేట్లు: విద్యార్థులకు వివిధ విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్లు పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. అభ్యర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా ‘డీజీ వెరిఫై’ (Digi Verify) పద్ధతిలో ఈ సర్టిఫికేట్ల లభ్యత ఉండేలా వ్యవస్థను డిజైన్ చేయాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Read also Epaper : epaper.vaartha.com
Read also: