📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 10:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. దేశం మొత్తం మీద వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండగా, దాని ప్రభావం రాష్ట్రంపైనా పడనుందని తెలిపింది. జార్ఖండ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడినప్పటికీ, ద్రోణి ప్రభావం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేసింది. ద్రోణి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా విస్తరించి ఉంది.ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విపత్తుల నిర్వహణ

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.బుధవారం రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లా (Kurnool districts) ల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని, మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు ఏపీలో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.

AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు

అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 9 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం విజయనగరం, అనకాపల్లి (Anakapalli), అల్లూరి సీతారామరాజు, కర్నూలు, వైఎస్సార్‌ కడప, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఇది బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం. ఈ వర్షాలు సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది ప్రభుత్వం.

Read Also: Sadaram Slot Bookings : నేటి నుంచి ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్

#APDisasterManagement #APRainForecast #APWeatherAlert #BayOfBengalDepression #LightToModerateRain #RainUpdate #SrikakulamWeather #VijayanagaramRain #VisakhapatnamRain #WeatherNews Andhra Pradesh rains AP Disaster Management AP districts rain alert AP weather forecast AP weather update Breaking News in Telugu depression effect on AP Google News in Telugu Here are the **English keywords** and **hashtags** based on your content: ### ???? **Keywords (SEO-friendly)** Andhra Pradesh rains Latest News in Telugu light to moderate rain Andhra Pradesh low pressure in Bay of Bengal rainfall warning AP Srikakulam rain Telugu News Today Visakhapatnam rainfall Vizianagaram weather weather report Andhra Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.