AP Rains: నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడన రూపంలో పశ్చిమదిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది మరింతగా అల్పపీడనానికి తగ్గే అవకాశం ఉందని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
Read Also: Births : సహజ ప్రసవాలు పెంచేందుకు ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్(AP Rains)లో కూడా వర్షాల ప్రభావం కనిపించనుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతంలో తిరుపతి(Tirupathi) జిల్లా తొట్టంబేడు 47.2 మి.మీతో అత్యధిక వర్షపాతం నమోదు చేయగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ, తిరుపతి జిల్లా మన్నారుపోలూరులో 32.7 మి.మీ, చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మి.మీ వర్షం నమోదైంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: