ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.వాతావరణశాఖ (Department of Meteorology) సమాచారం ప్రకారం, ఇవాళ నుంచే వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.
రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనించి
ఈ వర్షాల ప్రభావం రాబోయే మూడు రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే ఇళ్ల నుండి బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ముంపు ప్రాంతాల్లో వాహనాలు నడపరాదని, వరద ముంపు ప్రాంతాల్లో పిల్లలు ఆడకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనించి వ్యవసాయ పనులను (Agricultural work) సవరించుకోవాలని సూచించారు.గురువారం పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వానలు పడ్డాయి.ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలతో పాటుగా గంటకు40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం.. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రకాశం జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నాగులుప్పలపాడు, కొత్తపట్నం, మద్దిపాడు, సంతనూతలపాడు తదితర మండలాల్లో దాదాపు రెండు గంటలపాటు తెరపి లేకుండా పడింది. ఒంగోలు నగరం జలమయమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
వ్యవసాయానికి వర్షం ఎంత ఉపయోగకరం?
పంటలకు నీటి అవసరాన్ని తీర్చడంతో పాటు నేలలో తేమను పెంచి దిగుబడిని మెరుగుపరుస్తుంది.
భూగర్భ జలాలపై వర్షం ఎలా ప్రభావం చూపుతుంది?
వర్షం భూగర్భ జలాలను నింపి బావులు, బోర్లు నీటితో నిండేలా చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: