బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం ఇది పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ (North Andhra–South) ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
తీరాన్ని దాటే సమయం
ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తీర ఆంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
మత్స్యకారులకు కఠిన హెచ్చరిక
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు (Fishermens) ఎవరూ సముద్ర వేటకు వెళ్లకూడదని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచనలు
నదులు, వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజల ప్రాణ భద్రతే ప్రధానం కాబట్టి అధికారులు, స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని APSDMA (ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ) స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: