ఆంధ్రప్రదేశ్(AP Rain Alert) రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచార ప్రకారం, మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాను దశకు చేరుకుంది. దీనికి ‘సెన్యూర్(Senor)’ అనే పేరును నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యవస్థ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
Read also : Tirumala: మూడురోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే ‘వైకుంఠ’దర్శన టోకెన్లు జారీ
అదే సమయంలో, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా మారి, దాదాపు ఒక రోజులో వాయుగుండ స్థితికి చేరుకునే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :