📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: AP: ప్రజారోగ్యంలో సేవలు మెరుగుపడాలి

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ : ప్రజా వైద్య రంగంలో సేవలు(AP) విస్తృతంగా జరగాలని ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా వైద్యారోగ్య శాఖ(Health Department) పనితీరు, ఫలితాలపై మంత్రి సుదీర్ఘంగా 3గంటల పాటు సమీక్షించారు. 10మంది విభా గాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రజారోగ్య రంగంలో గత ఏడాదిన్నర కాలంలో కొంత మేరకు మార్పు తీసుకురాగలిగామని, చేయా ల్సింది ఇంకా చాలా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. లక్ష మందికి పైగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బందిలో బాధ్యతతో కూడిన విధుల నిర్వహణ, జవాబుదారీతనాలను పెంచి ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని, దీనికి విభాగాధిపతులే బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చర్యలతో ఈ ఏడాదిన్నర కాలంలో సిబ్బంది హాజరు, ఓపీ మరియు ఐపీ సేవలు, రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ మెరుగుపడి, సేవల నాణ్యత పెరగడంతో స్పష మైన మార్పును తేగలిగామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందని మంత్రి అన్నారు.

Read also: క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

AP Public health services need to improve

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి ఆందోళన

ఈ లక్ష్య సాధనకు(AP) వివిధ స్థాయిల్లో అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు. కూటమి ప్రభుత్వం సాధించిన మార్పు నేపథ్యంలో ఇటీవలి కాలంలో కొందరు ప్రభుత్వ వైద్యుల నిరక్ష్య ధోరణులపై వచ్చిన వార్తల పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవ త్సరానికి (2026-27) పూర్తి స్థాయిలో 100 ఎంబిబియస్ ప్రవేశాలకు ముందస్తుగానే జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి) అనుమతించిందని సమీక్ష సందర్భంగా మంత్రి వెల్లడించారు. పిడుగురాళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకం (సియస్వాస్) కింద చేపట్టిన వైద్య కళాశాలల్లో 2026-27లో ఎంబిబియస్ ప్రవేశాలు: కల్పించేందుకు తగుచర్యల్ని చేపట్టా లని మంత్రి డిఎంఇని ఆదేశిం చారు. ఆ మేరకు అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక సదు పాయాల కల్పనను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం పిపిపి పద్ధతిలో చేపడు తున్న ఆదోని, మార్కాపురం, మదన పల్లి, పులివెందుల వైద్య కళాశాలల్లో 2026-27లో ఎంబిబియస్ ప్రవే శాలకు అవసరమైన చర్యల్ని ప్రణా ళికా బద్ధంగా చేపటాలని మంత్రి డిఎంఇ అధికారులను ఆదేశించారు.

ప్రతి పనికీ లెక్క ఉండాలి

ఇప్పటి వరకు ఏమి చేశామో, ఇకముందు ఏమి సాధించాలో అన్న అంశాల పట్ల కొలమానం ఉండాలని, ఫలితాలను నిర్దిష్టంగా బేరీజు వేసుకోవాలని, అప్పుడే అనుకున్న మార్పును సాధించగలమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు వివరించారు. నిర్దిష్టంగా కొలవలేని ఏ అంశంలో కూడా మార్పును తేలేమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులైన డిఎంహెచ్లు, డిని హెచ్్యస్ల పనితీరును మంత్రి ఆక్షేపించారు. తమ బాధ్యతలు, వాటి నిర్వహణపట్ల అవగాహన లేనట్లు వీరు వ్యవహరిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్ను మంత్రి ఆదేశించారు. ప్రాథమిక, సెకండరీ, బోధానాసుపత్రుల సూపరింటెండెంట్ల పనితీరు కూడా బాగా మెరుగుపడాలని, వీరి పనితీరును ఆయా విభాగాధిపతులు నిరంతరం సమీక్షించి ప్రణాళికా బద్ధంగా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలందించాలని మంత్రి స్పష్టం చేశారు. జీజీహెచ్ సూప రింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్ల మధ్య సమన్వయ లోపం ఉండకూడ దన్నారు

స్క్రబ్ టైఫస్ పై చర్చ

వివిధ జిల్లాల్లో బయటపడుతున్న స్క్రబ్ టైఫస్ గురించి మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరంగా ఆరా తీశారు. ఈ విషయంలో ఎటు వంటి ప్రయత్న లోపం ఉండకూ డదని, ఈ సమస్య గురించి ప్రజల్లో నివారణ మరియు చికిత్సా మార్గాల పట్ల సమగ్ర అవగాహన కల్పించా లని మంత్రి ఆదేశించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి సూచనలు వెల్లడై దాని నిర్ధారణ జరగడానికి సమయం పడుతున్నందున, వ్యాధి సూచనలు కనిపించిన వెంటనే డాక్సి సైక్లిన్ మందు వాడడం ద్వారా దానిని అరికట్ట వచ్చని ఒక అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైంది. ఈ విషయా నికి సంబంధించి నిపుణులతో సమగ్రంగా చర్చించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలన కోసం అందజేయాలని మంత్రి సూచించారు. అయితే, 12 ఏళ్ల లోపువారికి ఈ మందు వాడరాదని డిఎంఇ తెలిపారు. మంగళగిరిలోని ఎపిఐఐసి టవర్స్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్, ఎపిఎం ఎసిసి ఎండి గిరీషా, డియసాచ్ చక్రధర్ బాబు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సిఇఓ దినేష్ కుమార్, ఏపిశాక్స్ పిడి నీలకంఠారెడ్డి, డిఎంఇ డాక్టర్ రఘునందన్, డిహెచ్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh health department Government Hospitals healthcare services Latest News in Telugu minister Satyakumar Yadav public health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.