📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: ఆర్టీసీలో 3,673 డ్రైవర్లు, 1,813 కండక్టర్ పోస్టులు భర్తీకి ప్రతిపాదన

Author Icon By Saritha
Updated: January 28, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ బోర్డుసమావేశం

విజయవాడ : మహిళలకు (AP) ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది కొరత సహా బస్సుల కొరత సమస్యలను అధిగమించేందుకు ఆర్టీసి బోర్డు (APRTC) సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మీడియాకు అందించిన సమాచారం మేరకు సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖాళీగా ఉన్నటువంటి 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం వేసి ప్రభుత్వానికి పంపింది.

Read Also: AP: అటవీ శాఖలో ఇంటి దొంగలపై ఉక్కుపాదం

Proposal to fill 3,673 driver and 1,813 conductor posts in RTC.

త్వరలో ఏపీకి 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

ఇందులో 3,673 డ్రైవర్లు పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. (AP) ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ.800 నుంచి రూ.1000 వరకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ. 900కి పెంచింది. పనిష్మెంట్ కేసులతో సంబంధం లేకున్నా ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కొనకళ్ళ వివరించిన మేరకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు రూపొందుతున్నాయి. వాటి నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత వీలయినంత త్వరగా ఇక్కడకు వస్తాయి. త్వరలోనే ఏపీకి 1,050 బస్సులు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తాయి.

అయితే ఆన్ కాల్ డ్రైవర్లను నియమించుకుని వారికి తగిన తర్ఫీదును అందించి డ్రైవింగ్ నైపుణ్యాన్ని సాధించిన తర్వాతే వారిని పూర్తి స్థాయి డ్రైవర్ ఉద్యోగులుగా నియమిం చుకుంటాం. అయితే ఈ రోజున తాత్కాలిక సిబ్బంది కావాలనే ఆలోచన సైతం ఉంది. జరుగుతోన్న సంప్రదింపులు అందుకు అనుగుణంగానే దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం సబ్సిడీని ఇస్తుంది. ఇంతకు ముందుగానే 1,050 బస్సులను ఆర్డర్ ఇవ్వడం జరి గింది. అవి ఇప్పుడు వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్న ఇబ్బంది నుంచి తాత్కాలికంగా బయటపడతాం. ప్రస్తుతం ఆ బస్సుల కోసమే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు దిల్లీ వెళ్లి వచ్చారు. ప్రస్తుతానికి కొత్త బస్సుల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇవన్నీ సకాలంలో పూర్తయితే కొరతనేది తీరిపోతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh RTC APRTC Free bus travel for women Latest News in Telugu Public Transport Stree Shakti scheme Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.