📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

Author Icon By Aanusha
Updated: February 5, 2026 • 12:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త అందించారు. సచివాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. అంతేకాకుండా, సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని, ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read Also: Mahalodda Waterfalls: పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

AP: Promotions for Secretariat employees: Minister Dola

పోస్టుల భర్తీకి చర్యలు

సచివాలయాల సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న మంత్రి… ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మార్చిలోపు వీటిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు, మూడు చక్రాల మోటార్ బైకుల పంపిణీ విషయాలపై చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ap Grama and Ward Secretariat latest news Minister Dola Bala Veeranjaneya Swamy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.