📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

AP: ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 41 మంది ఐఏఎస్ అధికారులు, 17 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదోన్నతులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Read Also: AP: కొబ్బరి రైతులకు 200కోట్లు సాయం

(AP) ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా చేపట్టే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు.

AP: Promotions for IAS and IPS

కార్మిక శాఖ కమిషనర్‌గా గంధం చంద్రుడు

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతారు. డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పదవిని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్‌వ్యవస్థీకరించారు. గంధం చంద్రుడుకు కార్మిక శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది.

ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు కేటాయించే పోస్టింగ్‌పై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government IAS officers promotion latest news senior IAS officers Super Time Scale Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.