ప్రొఫెసర్ ఆర్. ఉష రెండు దశాబ్దాలకు పైగా విస్తృతమైన బోధనా, పరిశోధనా మరియు పరిపాలనా అనుభవం ఉంది. 2013 నుండి ఆమె బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అంతకుముందు 2006–2012 కాలంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2001–2005 మధ్య లెక్చరర్‌గా పద్మావతి మహిళా వర్సిటీ లో విధులు నిర్వహించారు. అలాగే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో Tirupati టీచింగ్ అసిస్టెంట్‌గా, సి ఎస్ ఐ ఆర్,ఎస్ ఆర్ ఎఫ్, సి ఎస్ ఐ ఆర్,ఆర్ ఏ గా కూడా సేవలందించారు. ఆమెకు పీజీ స్థాయిలో 21 సంవత్సరాల బోధనా మరియు పరిశోధనా అనుభవం ఉంది ప్రొఫెసర్ ఉష 63 పరిశోధనా వ్యాసాలను ప్రచురించగా, 8 పుస్తకాలు/పుస్తక అధ్యాయాలను రచించారు. 9 జాతీయ పరిశోధనా ప్రాజెక్టులను నిర్వహించడమే కాకుండా 2 పేటెంట్లను పొందారు.
Read also: Srikakulam accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఇప్పటివరకు 10 మంది పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించి పీహెచ్‌డీ డిగ్రీలు అందించారు. ఒక విశ్వవిద్యాలయ స్టార్టప్‌లో కూడా ఆమె అనుబంధంగా ఉన్నారు. 42 అంతర్జాతీయ, 67 జాతీయ సదస్సుల్లో పాల్గొనడంతో పాటు అనేక సదస్సులను నిర్వహించారు.ఈమె మలేసియా , సింగపూర్ , థాయ్ ల్యాండ్ ఎత్చ్ అకాడమిక్స్ లో భాగంగా సందర్శించారు. మహిళా వర్సిటీ లో చైర్మన్ బి ఓ ఎస్ , అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ,ప్లేసెమెంట్ ఆఫీసర్ వంటి పదవులను నిర్వహించారు.
ఆమెకు ఏం ఎస్సీ. బోటనీ, ఎం ఇ డి లో గోల్డ్ మెడల్స్, ఇన్స్సా విజిటింగ్ ఫెలోషిప్, రాజీవ్ గాంధీ గోల్డ్ మెడల్ అవార్డు, ఎన్ ఇ ఎస్ ఏ ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డు, యూనివర్సిటీ బెస్ట్ టీచర్ అవార్డు (2021) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2024) లభించాయి. అలాగే 2024–25 సంవత్సరాలకు ఏ పి ఆర్ సెట్ కన్వీనర్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా నూతన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్. ఉష మీడీయా తో యూనివర్సిటీ ఎన్ ఐ ర్ ఫ్ ర్యాంకింగ్ లో 100 లోపు రావటానికి తనవంతు కృషి చేస్తానని మహిళా వర్శిటీ ఉద్యోగులు అందరూ ఒక కుటుంబముగా , సమిష్టిగా టీమ్ గా పనిచేస్తారని అందువలననే ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తానని
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: