తిరుపతి : దక్షిణ భారత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పి డిసిఎల్) పరిధిలో 2.07లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక్కో గృహానికి 2కిలోవాట్ల సోలార్ పంపిణీకి మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లో తేటి తెలిపారు. పిఎం సూర్యఘర్ బిజిలీ ముప్త యోజనపథం క్రింద సంస్థ పరిధిలో ఇప్పటివరకు 16వేల రూప్టాఫ్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటుచేయడం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. సంస్థ పరిధిలో ఫీరడ్ లెవల్ సోలరైజేషన్ ద్వారా 610మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
Read also: AP: ఈ నెల 28న కేబినెట్ భేటీ
Priority given to solar power
ఎస్పిడిసిఎల్ పరిధిలో సోలార్ విప్లవం
కుప్పం నియోజకవర్గ పరిధిలో ఫీరడ్ లెవల్ సోలరైజేషన్ పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్ల పనులు పూర్తి చేయడం ద్వారా 141మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. సోమవారం ఎస్పీడిసిఎల్ కార్పొరేట్ సంస్థ పరిధిలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎస్పీడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ ప్రాధాన్యం, సోలార్ విద్యుత్ (solar power) కనెక్షన్లు, స్మార్ట్ మీటర్లుపై ఉపయోగాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల శకటాలు, నృత్యప్రదర్శనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
పీఎం సూర్యఘర్ పథకానికి వేగం
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, అయూబ్ ఖాన్, కె. రామమోహన్రావు, సిజిఎంలు జె.రమణా దేవి, ఆర్. పద్మ, పిహెచ్ జానకిరామ్, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం.ఉమా పతి, ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ కార్యదర్శి ఎం.గోపాలకృష్ణ, చీప్ విజిలెన్స్ అధికారి కె.జనార్దన్ నాయుడు, సిజిఆర్ఎప్ చైర్పర్సన్ ఎ. శ్రీనివాస ఆంజనేయమూర్తి, పిఆర్ ఒ టి. మధుసూదన, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. సిజిఎంలు ఎం.మురళీకుమార్, ఎన్. శోభా వాలంటీనా, జిఎంలు టిఎస్ రాజశేఖర్రెడ్డి, జి. చక్రపాణి తదితరుల ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: