విజయవాడ : రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి బాసటగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు(AP power projects) వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం నాడు తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడీసీఎల్ కు చెందిన ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త పరిశ్రమల స్థాపన, తయారీ యూనిట్ల విస్తరణ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో… పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.
Read also: భారత్ డేటా రాజధానిగా విశాఖ
పారిశ్రామికాభివృద్ధికి బాసటగా విద్యుత్ ప్రాజెక్టుల వేగవంతం
రాష్ట్రంలో(AP power projects) ఏర్పాటు కానున్న పరిశ్రమలకు మోలిక వసతుల కల్పనలో భాగంగా ముఖ్యమైన విద్యుత్ ను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్తు విద్యుత్ లోడ్ను దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమలతో పాటు గృహ వినియోగదారులు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ సంస్థలు ముందుగానే సిద్ధం కావాలని ఆయన సూచించారు. భవిష్యత్లో పెరుగనున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండేందుకు 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ సామర్థ్యాలతో 29 కొత్త ఉప కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ ఉప కేంద్రాలు గ్రిడ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు కీలకంగా నిలుస్తా యని ఆశాభావంవ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: