📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Today News : AP Politics – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై నాయకత్వం అప్రమత్తంగా ఉండాలి – సజ్జల

Author Icon By Shravan
Updated: August 22, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ AP Politics : ఎన్నిక కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని వైకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల (Sajjala) రామకృష్ణారెడ్డి తెలిపారు. కేంద్ర కార్యాలయం నుండి ఆయన పార్టీ క్యాడర్తో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. పోలింగు బూత్లలో ఓటర్ల సంఖ్యను బట్టి ఓటర్లను మారుస్తుంటారని, ఇటువంటి అంశాలపై అవగాహనతో ఉండాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తతో వ్యవహరించాలని, ఏమరుపాటు ఉండకూదని పేర్కొన్నారు. బూత్ కమిటీలను నియమించుకోవడం అత్యంత ప్రధానమని వివరించారు. ఓటర్ లిస్టుపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. బిఎల్ఎ నియామకంపై ఇప్పటి నుండి పనిలో దిగాలని అన్నారు. 20 బూత్ల పరిధిలో ఒక సీనియర్ లీడర్ ను నియమించుకుని టాస్కుఫోర్స్ టీములాగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల లిస్టులో ఏ మార్పు జరిగినా వెంటనే తెలుస్తుందని వివరించారు. బాబూ ష్యూరిటీ మోసం గ్యారంటీ పథకంపై అందరూ పనిచేయాలని, అధ్యక్షుడు జగన్ దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు.

బూత్ లెవల్ ఏజెంట్ల సూచనలు పాటించాలి – బొత్స

శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ (Satyanarayana) మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్ల విషయంలో పార్టీ సూచనలు అందరూ పాటించాలని అన్నారు. అమరావతి వరదను కృష్ణానది పశ్చిమ కాలువలో పంప్ చేశామని ప్రభుత్వమే చెప్పిందని వైసిపి నాయకులు అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు తెలిపారు. కొండవీటివాగు ఇన్టేక్ నుండే కొండవీటివాగు మొదలవుతుందని వివరించారు. కొండవీటివాగు నాలుగు ఉప వాగులనూ డైవర్ట్ చేశారని అన్నారు. వరద ప్రవాహానికి శాశ్వత పరిష్కారం చూపకుండా రాజధాని నిర్మాణం పూర్తి కాదని అన్నారు. మెగా డిఎస్సి ఫలితాల వెల్లడిలో కూటమి సర్కార్ దగా చేసిందని, మెరిట్ లిస్టు విడుదల చేయకుండా అభ్యర్థులకే మెసెజేస్లు చేయడం ద్వారా టీచర్ పోస్టులను అమ్ము కునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసిపి విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, రవిచంద్ర అన్నారు. గతంలో రిజర్వేషన్ కోసం రోస్టర్ కింద జాబితాలు వెల్లడించేవారని, ఇప్పుడు అటువంటి పద్ధతి లేకుండా చేశారని అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/water-bulletins-released-in-all-districts-on-water-bulletin/andhra-pradesh/534245/

Andhra Pradesh politics AP Elections 2025 Breaking News in Telugu Latest News in Telugu Sajjala Ramakrishna Reddy Special Intensive Revision Telugu News Paper Voter List Revision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.