ఆంధ్రప్రదేశ్‌లో(AP Politics) రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కూటమి పార్టీలను లక్ష్యంగా చేసుకుని పెట్టిన పోస్టులు ఇప్పటికీ చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రచారానికి ఆ పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
Read Also: AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం
పవన్ కళ్యాణ్ విమర్శలు – అంబటి రాంబాబు సెటైర్లు వైరల్
ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో, విదేశాల్లో కూర్చుని విమర్శలు చేసే వారిని ఉద్దేశిస్తూ ఆయన ఘాటు మాటలు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయిన వారు ఇప్పుడు భవిష్యత్తులో ఏమి చేస్తామని మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెంటనే స్పందించారు. “మేము ఏమీ చేయలేకపోయామంటారు… మీరు అధికారంలో ఉన్నారు కదా, చేసిచూపించండి. మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ పవన్‌పై(AP Politics) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పోస్టులో పవన్ కళ్యాణ్ అధికారిక అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ, ఆయన వ్యాఖ్యల వీడియోను కూడా జత చేశారు. పవన్ వ్యాఖ్యలు, అంబటి ప్రతిస్పందనతో సోషల్ మీడియాలో రాజకీయ వాగ్వాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇరుపక్షాల పోస్టులు, కౌంటర్లు వేగంగా వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: