ఏపీ (AP) లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పలు పనుల కోసం, పలు రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. ఇంటి నుంచే సేవలు పొందేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. (AP) తాజాగా.. మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తానికి సంక్రాంతి పండుగ నాటికి దాదాపు అన్ని సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Read Also: AP Crime: పల్నాడులో టీడీపీ కార్యకర్తల హత్య రాజకీయ నేపథ్యంలో జరిగాయనే అనుమానాలు?
వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే
తాజాగా వాట్సాప్ గవర్నెన్స్‌లో పోలీసు సర్వీసులూ చేరాయి. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సర్వీసు కేటగిరీలోకి వెళ్తే ‘పోలీస్ శాఖ సేవలు’ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో FIR, FIR స్టేటస్, ఈ-చలాన్ వివరాలు తెలుసుకోవచ్చు. వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే బండిపై నమోదైన ఈ-చలాన్ వివరాలు వస్తాయి. అక్కడే UPI ద్వారా చెల్లించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: