పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకొని శిశు విక్రయాలకు పాల్పడుతోన్న సరోజిని అండ్‌గ్యాంగ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చింది. సరోజ సహా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నుంచి ఐదుగురు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్లలను ఢిల్లీ, ముంబై నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. పిల్లలు లేని వాళ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
Read Also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య
కేసు నమోదు
గత మార్చిలో ఆరుగురు పిల్లలను విక్రయిస్తుండగా బలగం సరోజినిని అరెస్ట్ చేశారు. అయితే మరోసారి కూడా పిల్లలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమెతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 11 మంది పిల్లలను రక్షించామని తెలిపారు. అయితే పిల్లల విక్రయం చిన్న విషయం కాదని, మరింత లోతుగా విచారిస్తున్నామని తెలిపారు.
విజయవాడకు (AP Crime) చెందిన సరోజిని..పిల్లలను అమ్మి సొమ్ము చేసుకోవడమే బిజినెస్‌గా పెట్టుకుంది. ఏపీ , తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్‌పై కేసులున్నాయన్నారు ఏపీ (AP Crime) పోలీసులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: