బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదన
విజయవాడ : నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ (TG) అవలం బిస్తున్న విధానాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట (AP) ఆంధ్రప్రదేశ్ తన వాదనలను విన్పించింది. తెలంగాణ ఈ విషయంలో అనుసరికాదని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వద్ద నీరు తీసుకోమంటూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటు న్నారని ఎండగట్టింది. తెలంగాణకు నిర్దిష్ట విధానాలు లేవంటూ ఆక్షేపించింది. గోదావరి నుంచి 240 టీఎంసీలను తెలంగాణ మళ్లి స్తోందని వాదనలు వినిపించింది. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదని ఇందుకు చట్టబద్ద రక్షణలున్నాయని పేర్కొంది. ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ విధానాలను ఏపీ తీవ్రసాయిలో తిప్పికొట్టింది.. సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా ఏపీ తరఫున వాదనలు వినిపించారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని మరోవైపు పోలవరం నుంచి నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటోందని వాదించారు.
Read Also: AP: రీసైక్లింగ్ పరిశ్రమలకు 40 శాతం రాయితీ
కృష్ణా నది నీటి మళ్లింపును నిలిపివేయలేమని స్పష్టం
డీపీఆర్ ను తయారుచేయకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి 811 నిర్దిష్ట విధానాలు లేవన్నారు. (AP) ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన టీఎంసీలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాజెక్టులూ ఉన్నాయన్నారు. తెలంగాణ వాదిస్తున్నట్లుగా కృష్ణా నది నుంచి ఇతర బేసిన్లకు నీటి మళ్లింపును నిలిపివేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ మళ్లింపునకు రెండు ట్రైబ్యునళ్లు, రాష్ట్ర విభజన చట్టం రక్షణలు ఉన్నాయని స్పష్టం చేశారు. బయటి పరీవాహానికి మళ్లించే నీటికి అంతర్గత పరీవాహక కేటాయింపులతో సమంగా రక్షణ కల్పించాలన్నారు.
తెలంగాణ వాదనల్లో నిజాలు లేవంటూ ఒక్కో అంశాన్నీ ప్రస్తావిస్తూ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్రల ఎదుట వాదనలు కొనసాగించారు. జయదీప్ గుప్తాకు సీనియర్ న్యాయవాది ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, జె. శరత్ చంద్ర సహకరించారు. పెన్నా పరీవాహకంలో మరే పరీవాహకంలో లేనంతగా నీటి లభ్యత తక్కువగా ఉందని, కరవు తీవ్రంగా ఉందని జయదీప్ గుప్తా వివరించారు. ఆ కరవు ప్రాంతాలకు నీటిని మళ్లిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
తెలంగాణ వాదనలలో నిజాలు లేవని వివరాలు
కృష్ణా నుంచి నీటిని మళ్లించవద్దని, గోదావరి నుంచి తీసుకోవాలని, ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని పెన్నాకు గోదావరి ప్రత్యామ్నాయ ఆధారమంటోందని గుర్తు చేశారు. అటు ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయడాన్నీ అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ ఖరారు చేస్తుందని, తెలంగాణ వాదించినట్లుగా ఆయా ప్రాజెక్టుల్లో నీరు ఆదా అవుతోందా అది నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన జయదీప్ ప్రతి ప్రాజెక్టుకూ సంబంధించి తెలంగాణ చేసిన వాదనలు ఏ రకంగా తప్పో స్పష్టంగా వివరిస్తామని బదులిచ్చారు.
అందుకు అవసరమైన డాక్యు మెంట్లు సిద్ధం చేస్తున్నామని చెబుతూ వాదనలు కొనసాగించారు. పరివాహకం బయటకు నీటి ప్రవాహాల మళ్లింపును కావేరీ జల వివాద ట్రైబ్యునల్ నిషేధించిదని తెలంగాణ వాదిం చిందని గుర్తుచేసిన జయదీప్ కావేరీ ట్రైబ్యునల్ అలాంటి నిర్ణయాలు వెలువ రించలేదని తేల్చిచెప్పారు. బేసిన్ బయటకు నీటి మళ్లిం పులను సుప్రీంకోర్టూ సమర్థించిందని స్పష్టం 5. 1987, 2002, 2012 విధానాలు ఇతర బేసిన్లకు నీటి బదిలీలను అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్, బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ రెండూ నీటి మళ్లింపులను చట్టబద్ధం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: