విజయవాడ : అమరావతిలో కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో కాగ్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని డిప్యూటీ కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేఎస్ సుబ్రహ్మణియన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రూ.60 కోట్లతో తపాలా శాఖ ప్రాంతీయ కార్యాలయం: కేంద్రమంత్రి పెమ్మసాని దీనిపట్ల మంత్రి పెమ్మసాని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిలో రూ.80 కోట్లతో అత్యాథునిక రీతిలో తపాలాశాఖ ప్రాంతీయ కార్యాలయం నిర్మించనున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన లోక్‌సభలో కొత్త పోస్టాఫీసుల నిర్మాణంపై అనంతపురం సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం చెప్పారు.
Read also: AP Cabinet Decisions : ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
Permission granted for the construction of the CAG office in Amaravati
2021 నుంచి 2024-25 మధ్యకాలంలో రాష్ట్రంలో ఐదు కొత్త పోస్టాఫీసులు నిర్మించినట్లు తెలిపారు. ఇక కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్వ్ జాదవ్ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం ఇక్కడ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా నడింపాలెంలో ప్రతిపాదించిన ఆస్పత్రి, సెంట్రల్ యోగా, నేచురోపతి ఇనిస్టిట్యూట్ ను త్వరగా పూర్తి చేసే విషయంపై చర్చించారు. కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయ విధానం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశకు 587 పాఠశాలలు మంజూరు చేయగా, ప్రస్తుతం 499 మాత్రమే పనిచేస్తున్నాయని, కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
భూసేకరణలో సమస్యలున్నట్లు
ఆంధ్రప్రదేశకు కేటాయించిన ఆక్వా పార్క్ నిర్మాణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలన్న షరతుతో రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 5న ఎల్ 1 బిడ్దర్ కు అప్పగించిందని కేంద్ర మత్సశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో టిడిపి సభ్యుడు బీద మస్తాన్రావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. 2025 మార్చి 30 కల్లా పూర్తి చేయాలన్న షరతుతో కేంద్ర ప్రభుత్వం 2022-23 లో రూ.52.85 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే భూసేకరణలో సమస్యలున్నట్లు తొలుత రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. చివరకు 2024 ఆగస్టులో భూమి కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడం కూడా జాప్యానికి ఒక కారణమని వివరించారు. వీటన్నింటినీ అథిగమించి ప్రాజెక్టు నిర్మాణ భాధ్యతలను కాంట్రాక్టర్ కు అప్పగించి 2026 ఆగస్టు 5కు పూర్తిచేయాలని షరతు పెట్టినట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: