మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
విజయవాడ : కూటమి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక(AP) చర్యలతో పండ్లు, ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నిలిచిందని పూర్వపు ఉద్యోగుల సంఘనాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డయడానికి ఆర్బీఐ నివేదికే నిదర్శనమని పేర్కొన్నారు. 193 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1/ ఏపీ నిలిచిందన్నారు. పరిశ్రమల వృద్ధి, పవర్ ప్రొడక్షన్, ఆక్వా, పర్ క్యాపిటా ఇన్ కాం, జీఎస్ డీపీలో ఆర్బీఐ నివేదక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెరుగుగా కనిపించదన్నారు. 90శాతం సబ్సిడీతో కూటమి ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా ఇంత రాయితీ ఇవ్వలేదన్నారు. రాయలసీమను హార్టి కల్చర్ హబ్ గా మార్చినట్లు పేర్కొన్నారు.
Read also :Minister Bhupathiraju: తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు
పెట్టుబడులతో ఉద్యోగ సృష్టే కూటమి ప్రభుత్వ లక్ష్యం
జగన్మోహన్ రెడ్డి(AP) మైక్రో ఇరిగేషన్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పర్ క్యాపి టా ఇన్ కాం రూ. 2లక్షల 66 వేలు వచ్చిందన్నారు. 16లక్షల జీఎస్ డీపీ వచ్చిందని తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనా రాజేంద్ర నాథ్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేస్తున్న అప్పులకు జీఎస్ డీపీకు అసలు సంబంధం లేదన్నారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. కూటమి ప్రభుత్వం దానిని గాడిలో పెడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ హయంలో నిరుద్యోగం దాదాపుగా 7 శాతానికి పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో 15,941 టీచర్, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పెట్టుబడులను ఆకర్షించి 20లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమెజ్ తో ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని అన్నారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :