📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి.. ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ

Author Icon By Saritha
Updated: January 29, 2026 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ (AP) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలోని రైల్‌భవన్‌లో కలిశారు. పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)తో పాటు పలు అంశాలను వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాంతమని అక్కడి రైల్వేస్టేషన్‌ను అమృత్‌ పథకం కింద చేర్చి ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని రిక్వెస్ట్ చేశారు.

Read Also: AP: రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే!

ఢిల్లీ పర్యటనలో రైల్వేపై ప్రధాన హామీలు

అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభస్వామి కొలువైన ఈ పవిత్ర క్షేత్రానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారని వారి సౌకర్యార్థం మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. సేతు బంధన్‌ పథకం రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిని ఇప్పటికే మంజూరు చేశారని దీనిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని పవన్ కోరారు. (AP) పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలనే తన విజ్ఞప్తికి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు. తన ప్రతిపాదనలన్నింటినీ రైల్వేమంత్రి పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

పిఠాపురంలో రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఇటీవల స్థానికులతో మాట్లాడుతూ ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్‌ను కలిశారు. సేతు బంధన్‌ పథకం కింద ఇదివరకు మంజూరైన పిఠాపురం ఆర్వోబీ పనులను, ప్రధానమంత్రి గతిశక్తి పథకంలోకి మార్చాలని ఆయన మంత్రిని కోరారు. ఈ పనులను పీఎం గతిశక్తి పథకంలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఫోకస్ పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



AndhraPradesh AshwiniVaishnaw DeputyCM Latest News in Telugu ModelStation PawanKalyan pithapuram RailwayStation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.