📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

AP: కార్యకర్త ఇంటికెళ్లి… నేనున్నానంటూ పవన్ భరోసా

Author Icon By Saritha
Updated: January 22, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చందు వెంకటవసంతరాయలు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్

విజయవాడ : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. (AP) కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. బుధవారం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియా శీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరా మర్శించారు. గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయలుకి బ్రెయిన్ డెడ్ కాగా, అతని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న పవన్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Pawan Kalyan went to the activist’s house and assured him, “I am here for you.”

Read Also: AP: మాతా, శిశు మరణాలు తగ్గించాలి

మేము తోడుంటా మంటూ కుటుంబానికి భరోసా

ఈ మేరకు బుధవారం(AP) పెదచందాలలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. వారు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. తండ్రి మరణానంతరం ఉద్యోగం వదిలి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సీతారామరాజుని అభినందించి, అతని వివరాలు తెలుసుకున్నారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపం, మాటలు రావని తెలుసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సాయం చేయాలని అధికారులకు సూచించారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీం కింద ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలన్నారు.

మీ కష్టంలో మేము తోడుంటా మంటూ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయలు కుటుంబానికి పరామర్శ లక్షల బీమా చెక్కుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ఇంటి పెద్దను కోల్పోతున్నామన్న బాధలోనూ వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సంఘటనలు అదురుగా జరుగుతాయి. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవదానం చేసిన వసంత రాయలు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నా. మరణంలోనూ మరో ఐదుగురికి ఊపిరి పోయడం గొప్ప విషయం. వసంత రాయలు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం” అని అన్నారు.

అడుగడుగునా జననీరాజనం

వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. (AP) పూలు, పూలమాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామ గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుస్సేన్ పాలెం, కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చిన పాండ్రాక, చెరుకుమల్లి, కృత్తివెన్ను, గాంధీనగర్, పెద చందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులుతీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. కార్యక్రమంలో పెడన శానస సభ్యులు కాగిత కృష్ణప్రసాద్, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు, జనసేన ఎన్టీఆర్, కృష్ణా, జిల్లాల అధ్యక్షులు సామినేని ఉదయభాను, బండ్రెడ్డి రామకృష్ణ, నియోజకవర్గాల పిఓసీలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh JanaSena Party Latest News in Telugu Pawan Kalyan support for party workers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.