విజయవాడ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) వెల్లడించారు. ఈ మేరకు డీసీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. స్వమిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. రెండో విడత మరో 5,847 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరుకి మరో 45.66 లక్షల మందికి వారి యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం చేస్తాం. డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించి మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు నిర్దేశించాం. అందుకోసం సర్వే విభాగం గ్రామ సర్వేయర్ల సేవలను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించే ఏర్పాటు చేయాలి.
Read also: SCR: సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
AP
రాజ ముద్రతో కూడిన కార్డులు
పంచాయతీరాజ్ శాఖ, సర్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు స్వమిత్వ సర్వేను నిరంతరం పర్యవేక్షించాలి. క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా స్వమిత్వ పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల అభిప్రాయం సేకరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వే, గత ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన పాసు పుస్తకాల కారణంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మన ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదు. రీ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ ప్రాపర్టీ కార్డులు ఇస్తాం. రాజ ముద్రతో కూడిన కార్డులు అందిస్తాం. ఈ ప్రాపర్టీ కార్డులు వచ్చిన తర్వాత ఆయా స్థలాలు అమ్ముకునేందుకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదు.
అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో అన్నింటినీ అధిగమించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
నీటి నాణ్యత పక్కగా ఉండాలి
పండగ 2.0ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళాలన్నారు. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిoచాలన్నారు. పల్లెల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో జల్ జీవన్ మినష్ పనులు ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి. నీటి నాణ్యత పక్కగా ఉండాలి. అదే అందరి ప్రధమ బాధ్యత కావాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి నీటి సరఫరా వ్యవస్థల వద్ద నీటి నాణ్యతను స్వయంగా పరిశీలన చేస్తాను. గ్రామీణ ప్రజలకు అందించే మోలిక వసతుల్లో రోడ్లు, మంచి నీటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: