ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా నిలిచింది. ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో పాటు, వాతావరణం కూడా సహకరించకపోవడంతో పంట నాణ్యత దెబ్బతింది. దీంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించింది.
Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఆర్థిక సహాయం
ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు రూ.128.33 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ పథకం కింద, కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752 మంది రైతులను గుర్తించి, వారికి పరిహారం అందించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం రైతుల అకౌంట్‌లలో జమ చేస్తోంది. ఈ-క్రాప్ ఐడీని పరిశీలించి, అర్హులైన రైతులందరికీ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: