గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలనే ఉచిత వైద్య పరీక్షలు
రంపచోడవరం : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న(AP) ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా,(Sitarama Raju District) రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవితో కలిసి ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ… ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు చేయూత అందిస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తామన్నారు. ప్రజలు సహకారం, దాతల సహకారంతోనే ఇదంతా చేస్తున్నామని, ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకొస్తున్నారని భువనేశ్వరి తెలిపారు.
Read Also: Rohit Sharma: పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్నా
ఆదివాసీలకు ఎన్టీఆర్ బతుకుదెరువు చూపించారు : ఎమ్మెల్యే శిరీషాదేవి
వెనకబడ్డ తమ ప్రాంతంలో ఇన్ని రకాల ఉచిత సేవలు అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి అన్నారు. (AP) ఏజెన్సీ ప్రాంతంలో సికెల్ సెల్ వ్యాధి ఎక్కువగా ఉందని, ఈ వ్యాధికి రక్తం ఎక్కిస్తూనే ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో రంపచోడవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భువనేశ్వరిని కోరగానే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్టీఆర్ ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే బస చేశారు. గిరిజనుల జీవన పరిస్థితులు చూసి జీడి మామిడి మొక్కలు అందించి ప్రోత్సహించారు. అరకులో కాఫీ పంటలు ఎలాగో ఇక్కడ జీడి ఫేమస్. ఉండటానికి ఇళ్లు, తినడానికి తండి, కట్టుకోవడానికి బట్ట అందించారు. కిలో బియ్యం రెండు రూపాయలకు పేదలను దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమమే. ఆదివాసీలకు ఎన్టీఆర్ బతుకుదెరువు చూపించారు అని ఎమ్మెల్యే మిరియాల శిరిషా అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ… ఏజెన్సీలో ఉచిత వైద్య క్యాంప్ ద్వారా సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. వరదల సమయంలో భువనేశ్వరి తల్లిలా మనల్ని అదుకున్నారని, మెడిసిన్, దుప్పట్లు, కూరగాయలు, నిత్యావసరాలు ట్రస్ట్ తరపున అందించారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: