ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు సినీ, సామాజిక రంగాల వ్యక్తులు, పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also: Pawan Kalyan Movie: పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్
నెట్టింట వైరల్‌గా ఎన్టీఆర్ చేసిన ట్వీట్
ఈ క్రమంలోనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ..లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ట్వీట్
రాష్ట్ర విద్యా వ్యవస్థలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్న మార్పులు భావి తరాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు లోకేశ్ వేస్తున్న అడుగులు అభినందనీయమన్నారు. కేవలం విద్యారంగమే కాకుండా, ఐటీ మంత్రిగా రాష్ట్రంలో,
దిగ్గజ సంస్థల స్థాపనకు లోకేశ్ చేస్తున్న కృషి యువతకు కొత్త ఆశలు చిగురింపజేస్తోందని కొనియాడారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ సిద్ధం చేసిన ప్రణాళికలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో లోకేశ్ నిరంతరం కొనసాగుతూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: