📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: 25 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేయనున్న నిర్మలా సీతారామన్

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు రాబడుతోంది. అలానే ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేయడం కోసం కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది.

Read Also: Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

ఒకే వేదికపై నుంచి పునాది రాయి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు.అమరావతిలోని సీఆర్‌డీఏ (CRDA) ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండటం విశేషం.

AP: Nirmala Sitharaman to lay foundation stone of 25 bank buildings

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేశ్ తదితరులు హాజరుకానున్నారు.రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా, సీఆర్‌డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది.

ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

25 banks construction Amaravati Development AP capital progress financial district latest news Nirmala Sitharaman Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.