AP News: అన్నమయ్య జిల్లా(Annamayya district) రాజంపేట నియోజకవర్గంలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సాధారణంగా దొంగతనం జరిగితే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ, అదే పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనం మాయమైతే ఎవరి వద్దకు వెళ్లాలి అన్న ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది. మూడు నెలలు గడిచినా బైక్ ఆచూకీ లేకపోవడం, పోలీసుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
Read also: HYD: జీడిమెట్లలో మూతబడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ యూనిట్‌లో మిషనరీ చోరీ
దొంగతనం ఘటన నుంచి బైక్ మాయం వరకు
సమ్మెపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లెలో నివసించే రంగుల నాగేశ్వర అనే వ్యక్తి ఇంట్లో ఈ ఏడాది సెప్టెంబర్ 22న తెల్లవారుజామున దొంగతనం ప్రయత్నం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగను గమనించిన నాగేశ్వర వెంటనే అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దొంగ అక్కడికి వచ్చిన ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు.
తక్షణమే సమాచారం అందుకున్న సంబేపల్లి పోలీసులు ఆ బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. నాగేశ్వర అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. అంతవరకు వ్యవహారం సక్రమంగానే సాగింది.
మూడు నెలలైనా మౌనమే: అనుమానాలకు దారి
AP News: అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన సీజ్ చేసిన బైక్ ప్రస్తుతం కనిపించకుండా పోయింది. మూడు నెలలు గడిచినా దొంగ ఆచూకీ లేదు, కేసు పురోగతిపై ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులను ప్రశ్నిస్తే సమాధానం మౌనమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పోలీస్ రికార్డుల్లో కూడా ఆ బైక్ వివరాలు నమోదు కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులే దొంగకు సహకరించారా? లేక వాహనాన్ని విక్రయించారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సమగ్ర విచారణకు డిమాండ్
ఈ సంఘటన పోలీసుల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉండాల్సిన సీజ్ వాహనమే మాయమైతే, సామాన్యుల నమ్మకం ఎలా నిలబడుతుంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరపాలని, బైక్ ఏమైందనే అంశంపై స్పష్టత తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: