AP News: అంబేద్కర్ కోనసీమ(Ambedkar Konaseema) జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. పైప్ నుంచి ఒక్కసారిగా భారీగా గ్యాస్ వెలువడటంతో ఆ ప్రాంతం మొత్తం పొగతో కమ్ముకుంది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురై, తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు.
Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు
కొంతసేపటి పాటు మంటలు(Gas Leak Incident) ఎగసిపడటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రస్తుతం లీక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ లీక్‌కు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, ప్రజలు ఎవరూ ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: