📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

AP: పోలీసు శాఖకు కొత్త రూపు

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిపి హరీష్ గుప్తా

విజయవాడ : (AP) ఆధునిక సాంకేతికత ఆధారిత పోలిసింగ్ దిశ గా ఏపీ పోలీసు శాఖ మరో ముందడుగు వేసిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) తెలిపారు. శుక్రవారం ఆధునిక సాంకేతికత ఆధారిత పోలి సింగ్ను అమలు పరుస్తుంది. రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్సమెంట్(రేస్) నూతన వాహనాలు. ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను రాష్ట్రంలోని 8 జిల్లాల కోసం శుక్రవారం డీజీపీ ప్రారంభించారు. అడవులు, కొండ ప్రాంతాలు, దూర. దుర్గమ ప్రాంతాలు, తీరప్రాంతాలు, ప్రకృతి విపత్తులకు లోనయ్యే ప్రాంతాల్లో వాణిజ్య మొబైల్ నెట్వర్క్ లు తరచూ విఫలమవుతున్న నేపథ్యంలో, పోలీసు శాఖకు నిరంతర, విశ్వస నీయ సమాచార వ్యవస్థను అందించడమే రేస్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని డీజీపీ తెలిపారు.

Read also: AP :దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చలనం కలిగిన మొబైల్ కమ్యూనికేషన్ కేంద్రాలు

(AP) ఈ రేస్ వాహనం ఒక స్వతంత్ర, చలనం కలిగిన మొబైల్ కమ్యూనికేషన్ కేంద్రంగా పనిచేస్తూ, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. రేస్ ఫేజ్-1 2018-19 సంవత్సరంలో ఎంవోపిఎఫ్ బడ్జెట్ కింద రూ.2.13 కోట్ల వ్యయంతో 9 జిల్లాలకు ఫోర్ వీలర్స్-9, టూ వీలర్స్-20 వాహనాలను సమకూర్చమన్నారు. రేస్ ఫేజ్-2లో 2025-26 సంవత్సరానికి ల్నీశినీ బడ్జెట్ కింద రూ.2 కోట్ల వ్యయంతో 8 జిల్లాలకు ఫోర్ వీలర్స్ 8, టూ వీలర్స్, 16 రేస్ వాహనాలను సమకూర్చనట్లు తెలిపారు.. వాణిజ్య
మొబైల్ నెట్ వర్క్ లపై ఆధారపడకుండా నిరంతర విశ్వసనీయ కమ్యూనికేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు, బందోబస్తు విధులు, ఎన్నికలు, ఆందోళనలు, జాతరలు ఉత్స వాల్లో తక్షణ కమాండ్ కంట్రోల్ ఉంటుందన్నారు. విపత్తులు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన ఉంటుందన్నారు. పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ తదితర శాఖల మద్య మెరుగైన సమన్వయం కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

ఫీల్డ్ యూనిట్లకు సంపూర్ణ కమ్యూనికేషన్

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఫీల్డ్ యూనిట్లకు సంపూర్ణ కమ్యూనికేషన్ మద్దతు ఉంటుందన్నారు. గతంలో కచ్చలూరు, పోలవరం జిల్లాల్లో జరిగిన బోటు ప్రమాదం వంటి కీలక ఘటనల్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ సౌకర్యాలు లేని కొండ ప్రాంతాల్లో రేస్ వాహనాలు ప్రత్యేక కమ్యూనికేషన్ సాధనాలుగా పనిచేసి, రక్షణసహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయి. 8 జిల్లాలకు రేస్ వాహనాల ప్రారంభంతో రాష్ట్రంలో అంతిమ పరిది వరకు (లాస్ట్ మైల్) కమ్యూనికేషన్, విపత్తు సిద్ధత, శాంతి భద్రతల నిర్వహణ మరింత బలోపేతం కానుంది. ఇది ప్రజా భద్రతకు, ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీసుకుంటున్న మరో కీలక ముందడుగుగా ఇది నిలుస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీపీ (టెక్నికల్ సర్వీసెస్) సి.హెచ్. శ్రీకాంత్, డీఐజీ (కమ్యూనికేషన్స్) ఎన్.ఎస్.జె. లక్షి ్మ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


Andhra Pradesh police DGP Harish Kumar Gupta Latest News in Telugu RACE Project Remote Area Communication Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.