ఆంధ్రప్రదేశ్ (AP) లో, మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, మదనపల్లెను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు నివేదిక అందించింది. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు ఉండనున్నాయి. అటు అద్దంకి, నక్కపల్లి, పీలేరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. CM ఆమోదం తెలిపాక ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.
Read Also: Minister Durgesh: మానవతా దృక్పథంతో తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి
ఒక నెల గడువు
అభ్యంతరాలు, సూచనలకు నెల గడువు ఉంటుంది. ఒక నెల గడువులో, పౌరులు కొత్త జిల్లాల సరిహద్దులు, మండలాల విభజనపై తమ సూచనలు, అభ్యంతరాలుప్రభుత్వానికి పంపవచ్చు. కొత్త డివిజన్ ఏర్పాటు ద్వార పరిపాలనా విధులు మరింత వేగవంతం కానున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: