📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

AP: మాతృభాషను విస్మరిస్తే ఉనికిని కోల్పోయినట్లు అవుతుంది: సీఎం

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని, ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక (AP) నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు పేరును ఈ వేదికకు పెట్టడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

Read Also: TG Bharat: నా నియోజకవర్గంలో వేలు పెడితే ఎవరినీ వదిలిపెట్టను: మంత్రి

10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని వ్యాఖ్య

తెలుగు భాషకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, దేశంలో వందలాది భాషలు ఉన్నప్పటికీ ప్రాచీన హోదా పొందిన ఆరు భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేశారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే నాలుగో భాష తెలుగు అని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని వివరించారు. (AP) ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకావడం తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఆధునిక తెలుగు భాషకు పితామహుడైన గిడుగు వెంకట రామ్మూర్తి సేవలను తెలుగు జాతి ఎప్పటికీ మరువలేదని చంద్రబాబు కొనియాడారు. నేను తెలుగువాణ్ణి నాది తెలుగుదేశం అని గర్వంగా చాటిచెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. 1985లోనే ఎన్టీఆర్ ముందుచూపుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్ర విభజన తర్వాత రాజమహేంద్రవరంలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Andhra Pradesh Chandrababu Naidu Rajamahendravaram Telugu culture telugu language Telugu News World Telugu Conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.