కేంద్ర గిరిజన (AP) వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్, (Minister Juval Oram,) అమరావతిలోని (Amaravati) కేఎల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ఆరో జాతీయ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవం ‘ఉద్భవ్-2025’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమ సంస్కృతి, సంప్రదాయాలను కూడా తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also: CBN: సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల తరహాలోనే ఏకలవ్య పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తామని జువల్ ఓరమ్ హామీ ఇచ్చారు. విద్యార్థులు హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషలపై పట్టు సాధించడం కూడా ముఖ్యమని సూచన చేశారు. క్రీడల్లోనూ గిరిజన విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరియు అధికారులను ఆయన అభినందించారు.
‘ఉద్భవ్’ మార్పునకు వేదిక: ఏపీ మంత్రి సంధ్యారాణి
ఈ సందర్భంగా ఏపీ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి (Minister Sandhyarani) మాట్లాడుతూ, ‘ఉద్భవ్’ అనేది కేవలం ఉత్సవం కాదని, గొప్ప మార్పునకు వేదిక అని అభివర్ణించారు. ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా 405 పాఠశాలల నుంచి 1,647 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, అందులో 110 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, పాఠశాలలకు మరింత నిధులు, కొత్త EMRS స్కూళ్ల మంజూరు చేయాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు.
అంతకుముందు, విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన సంస్కృతి ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించి, సరదాగా బాణం ఎక్కుపెట్టి ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: