తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పెద్ద ఎత్తున బీమా చెక్కుల పంపిణీ చేశారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 220 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆయన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.11 కోట్ల బీమా సాయాన్ని అందించారు.
Read also: Chandrababu: కొత్త జిల్లాలపై దృష్టి: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనలో భాగంగా ఈ ప్రమాద బీమా పథకం అమలవుతోందని నాగబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి కుటుంబాలు ఇబ్బందులు పడకూడదనే భావంతో ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 1,400 కుటుంబాలు ఈ బీమా పథకం ద్వారా లబ్ధి పొందినట్లు వివరించారు.
జనసేన పార్టీ తన ప్రతి కార్యకర్త వెన్నంటి నిలబడే సంస్థ అని, కష్టకాలంలో వారికి ధైర్యం ఇచ్చే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని నాగబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: