हिन्दी | Epaper
ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Latest News: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి

Anusha
Latest News: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి

స్కూల్‌కు వెళ్లాల్సిన అమ్మాయి రెండేళ్ల పాటూ నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. కన్నతల్లి కూతుర్ని ఇలా గదిలో ఉంచి నిర్బంధించింది. బాలికను గదిలో ఎందుకు బంధించావని అడిగిన స్థానికులకు తల్లి చెప్పిన సమాధానంతో అందరూ షాకయ్యారు. (AP) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్ఛాపురానికి చెందిన చక్రపాణివీధికి చెందిన భాగ్యలక్ష్మికి 2007లో ఒడిశా కటక్‌వాసి నరసింహరాజుతో వివాహం అయ్యింది.

Read Also: Sri Venkateswara Swamy: తిరుమల వైకుంఠద్వారం ఆన్లైన్

భాగ్యలక్ష్మి కాన్పు కోసం ఇచ్ఛాపురం వచ్చింది.. డెలివరీ తర్వాత అక్కడే ఉండిపోయింది. ఆమె భర్త పదేళ్ల క్రితం చనిపోగా.. భాగలక్ష్మి కుమార్తె మౌనిక (Mounika) తో కలిసి నివాసం ఉంటోంది. మౌనిక స్థానికంగా ఓ స్కూల్‌లో చదువుతోంది.. అయితే కూతురు పెద్దమనిషి అయ్యాక తల్లి భాగ్యలక్ష్మి చదువును మాన్పించింది.

చుట్టుపక్కల ఇళ్లలో వాళ్లు మౌనికను ఎందుకు స్కూల్‌కు పంపలేదని అడిగితే.. భాగ్యలక్స్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు.అప్పటి నుంచి కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టనివ్వలేదు. ఇంట్లోకి విద్యుత్ రాకుండా మెయిన్ కూడా ఆపేసింది.. ఇద్దరు చీకట్లోనే ఉంటున్నారు.

AP: Mother who held girl captive for two years
AP: Mother who held girl captive for two years

గదిలో ఉన్న మౌనికను ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు

ఒకవేళ భాగ్యలక్ష్మి పనిపై బయటకు వెళితే.. కూతుర్ని లోపలే ఉంచి తాళం వేసేది. గత రెండేళ్లుగా ఆ బాలిక గదిలోనే ఉంది. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త (Local Anganwadi worker) కు భాగ్యలక్ష్మి తీరుపై అనుమానం వచ్చింది. బాలిక బయటకు రాకపోవడం.. తల్లి ఒక్కరే బయటకు వస్తుండటంతో ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ పీవోకు దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం ఇచ్ఛాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జికి కూడా ఈ సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక తహసీల్దారు, ఎంఈవో, పోలీసులు కలిసి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లారు.భాగ్యలక్ష్మిని కౌన్సిలింగ్ చేసి.. ఇంటి లోపల గదిలో ఉన్న మౌనికను ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. తల్లీకూతుళ్లను తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

బాలిక మంచిచెడులు చూస్తామని ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భాగ్యలక్ష్మి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. కూతుర్ని ఇలా గదిలోకి బంధించడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. తన కూతుర్ని బయటకు పంపిస్తే ఈ సమాజం ఏం చేస్తుందనే భయంతోనే ఇలా చేసినట్లు చెప్పారట. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870