ఆంధ్రప్రదేశ్ (AP) లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం మరో ముఖ్యమైన దశకు చేరుకుంది. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం (AP) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.. మొత్తం 46,85,838 మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా డీబీటీ విధానంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
Read Also: Telemetry Issue: కృష్ణా పర్యవేక్షణలో నిలకడపై ప్రశ్నలు
పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు
రైతులకు ఆర్థిక బలాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటం రైతుల్లో సంతృప్తిని కలిగిస్తోంది. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ (PM Kisan) సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: