📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest news: Ap: శ్రీశైలం లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Author Icon By Saritha
Updated: October 16, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లన్న సేవలో భాగమయ్యారు

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)అక్టోబర్ 16న ప్రత్యేక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌(Ap)రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం 9.55 గంటలకు ఆయన కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకోగా, అక్కడినుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో కలిసి శ్రీశైలానికి వెళ్లారు.

శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇదే సందర్భంగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధానిగా శ్రీశైలానికి విచ్చేసిన నాలుగో నేతగా మోదీ గుర్తింపు పొందారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.

Read also: మంటల్లో చిక్కుకున వాహనాలు నలుగురు సజీవ దహనం

కర్నూలులో భారీ బహిరంగ సభ – రూ.13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

శ్రీశైలం పూజల అనంతరం మోదీ మధ్యాహ్నం 2.20కి మళ్లీ కర్నూలుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నన్నూరులో ఏర్పాటైన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభకు హాజరయ్యారు. సుమారు 450 ఎకరాల్లో ఈ సభా వేదికను ఏర్పాటుచేశారు. మూడు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు,(AP) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ప్రసంగించారు. వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మరియు చేపట్టబోయే రూ.13,429 కోట్ల విలువైన రవాణా, విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట రోడ్‌ షోగా ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో సభగా మార్చారు. సభ అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం 4.45కి ఢిల్లీకి తిరిగిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP development projects Breaking News in Telugu Chandrababu GST meeting modi speech Pawan Kalyan Srisailam Mallanna Darshan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.