📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Telugu News: AP: వైసీపీ పై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు  తీవ్ర విమర్శలు

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే, వైసీపీ (YSRCP) నేతలు విమర్శలు చేయడం దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Read Also: AP: మంత్రుల పని తీరు పై చంద్రబాబు సీరియస్

AP MLA Yarlagadda Venkat Rao strongly criticizes YCP

లోకేశ్ కృషి: గూగుల్ డేటా సెంటర్ ఘనత

“75 ఏళ్ల వయసులో చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనలో గూగుల్, అడోబ్, ఎన్విడియా వంటి 18 ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు” అని యార్లగడ్డ వివరించారు.

‘గూగుల్ మర్చిపోదు’ అన్న సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ, రూ. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్‌ను వైజాగ్‌కు తీసుకొచ్చిన ఘనత లోకేశ్‌ది అని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదం అని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్లి ఇలాంటి కంపెనీలతో సమావేశమయ్యారా అని ఆయన ప్రశ్నించారు.

కొడాలి నానిపై విమర్శలు, పాస్‌పోర్ట్ సమస్య

“యువగళం పాదయాత్రకు ముందు లోకేశ్‌ వేరు, తర్వాత లోకేశ్ వేరు. ఆయనతో అరగంట మాట్లాడగలిగే నాయకులు మీ పార్టీలో ఉన్నారా? ఆలోచించుకోండి” అని యార్లగడ్డ హితవు పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిపై యార్లగడ్డ తీవ్ర విమర్శలు చేశారు. “గుడివాడ ప్రజలు ఓడించారనే కక్షతో ఏడాది పాటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. అధికారం లేనప్పుడు ప్రజలకు సేవ చేయడమే గొప్పతనం. గతంలో మేం ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నాం” అని గుర్తుచేశారు.

బూతులు తిట్టడం, అగౌరవంగా మాట్లాడటం మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కనీసం గౌరవంగా అసెంబ్లీకి రావాలని వైసీపీ నేతలకు ఆయన సూచించారు. అక్రమ కేసుల కారణంగానే తన పాస్‌పోర్ట్ సమస్య వచ్చిందని, అందుకే లోకేశ్‌తో పాటు అమెరికా పర్యటనకు వెళ్లలేకపోయానని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CM Chandrababu naidu Deputy CM Pawan Kalyan Gannaavaram MLA Google News in Telugu Latest News in Telugu Minister Nara Lokesh TDP central office Telugu News Today US tour investments Yarlagadda Venkatrao MLA YSRCP Criticism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.