లైంగిక వేధింపుల ఆరోపణలు
AP: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నేడు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ విచారణలో త్రిసభ్య కమిటీ ఆయనపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించనుంది. కేవలం ఎమ్మెల్యే వాంగ్మూలం మాత్రమే కాకుండా, స్థానిక జనసేన నేతలు మరియు కార్యకర్తల అభిప్రాయాలను కూడా కమిటీ నమోదు చేయనుంది.
Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం
ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఈ వ్యవహారంపై జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ కేసును క్రమశిక్షణ కమిటీకి బదిలీ చేశారు. అధినేత ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిటీ, ఎమ్మెల్యే వివరణను బట్టి తదుపరి చర్యలపై నివేదిక సమర్పించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: