కుప్పం : తాత ఇచ్చిన స్ఫూర్తి.. తండ్రి నుంచి అలవర్చుకున్న పట్టుదల.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, యువత గళంగామారి రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మొదలై మంగళవారంతో మూడేళ్లు వూర్తి చేసుకుంటోంది. కుప్పంలో మొదలై.. రాష్ట్రంలో పెను సంచలనం! – అవరోధాలు..అడ్డంకుల్ని అధిగమించి.. మొక్కవోని ధైర్యంతో జనంలోకి !! తన యువగళం పాదయాత్రకు మంత్రి నారా లోకేష్ 2023 జనవరి 27న తన తండ్రి, సిఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచే శ్రీకారం చుట్టారు. మూడేళ్ల క్రితం స్థానిక లక్ష్మీపురంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుదీర్ఘ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదేరోజు కుప్పంలో బహిరంగసభలో ప్రసoగించారు.
Read also: Kurnool bus accident: ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
Minister Nara Lokesh’s ‘Yuva Galam’ padayatra
అధికారులు అనుమతులు నిరాకరించడంతో
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజక వర్గాల్లోను తొలుత తన పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర ఆడుగడుగునా ప్రజలు, రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. అవరోధాలు.. అడ్డంకుల్ని తట్టుకుని యువగళం పాదయాత్ర చేపట్టిన అప్పటి అధికార వైఎస్సార్సీ ప్రభుత్వం నుంచి వచ్చిన జిఓ నెం 1 కొంతమంది అధికారులనుంచి వచ్చిన అవరోధాలు, అడ్డంకులను తట్టుకుని ముందుకు సాగారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మంత్రి లోకేష్ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు అప్పటి పోలీసు అధికారులు అనుమతులు నిరాకరించడంతో రోడ్డుపైనే ఛెయిర్ ఎక్కి మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఇలా చాలా చోట్ల పాదయాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి.
యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు
అయితే మొక్కవోని ధైర్యంతో మంత్రి లోకేష్ జనంలో వెళ్లి వారి సాదక బాధలు అడిగి తెలుసుకుంటూ ముందుకుసాగారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశమై వారిలో నూతనోత్సాహం తెచ్చారు. పేదరికం లేని రాష్ట్రం కోసమే తాను పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. కుప్పంలో మొదలు పెట్టిన యువగళం పాదయాత్రను మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని దాదాప వర్గాల్లో ఆయన 31 32 కిలోమీర 5 ఎ యువగళం పాడు గళం పాదయాత్ర రాగానే మంత్రి నారా దిగ్విజయంగా నిర్వహించారు. 1000 కి.మీ.ల పాదయాత్ర ఆదోని, 1500కి.మీ. యాత్ర కడప, 2000 కి.మీ.ల పాదయాత్ర కావలి, 3వేలకి.మీ.ల పాదయాత్ర అనకాపల్లి, 3132కి.మీ.ల పాద యాత్ర అగనంపూడిలో కొనసాగింది. ఏది ఏమైనా మంత్రి నారా లోకేష్ నాటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని అకుంఠిత దీక్షతో చేపట్టిన ‘యువగళం’
పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: