📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేశ్

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రాజకీయాల్లో ఆరోగ్యకరమైన సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. కూటమిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలతో వ్యక్తిగత అనుబంధం పెంపొందించే లక్ష్యంతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశమైన ఆయన, ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

Read Also: CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం

Minister Lokesh starts a new tradition

ఈ సమావేశానికి (AP) కుటుంబసభ్యులతో సహా విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ స్వయంగా ఎదురేగి ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులను పలకరించి, పరిచయం చేసుకున్నారు. స్పీకర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అనే హోదాలకు అతీతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు కొనసాగింది. ఈ సమావేశం ఒక పిక్నిక్‌ను తలపించిందని నేతలు ఆనందం వ్యక్తం చేశారు. 

లోకేశ్ కేవలం ఆతిథ్యానికే పరిమితం కాకుండా, పాలనపైనా తనదైన ముద్ర చూపించారు. ఆయా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల పురోగతిపై ఒక నివేదికను తయారు చేయించి, వారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics Coalition Leaders Dinner Meeting IT Minister Latest News in Telugu Nara Lokesh TDP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.