📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu News: AP: మంత్రి లోకేష్ బిజీబిజీ.. ప్రముఖ కంపెనీల సిఇఓలతో వరుస భేటీలు

Author Icon By Sushmitha
Updated: December 10, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటన కొనసాగుతోంది, ఈ పర్యటనలో ఆయన ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతూ బిజీగా గడుపుతున్నారు.

Read Also: New Train: తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు

AP Minister Lokesh is busy.. Series of meetings with CEOs of leading companies

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ: ఐటీ సదుపాయాల ఆధునీకరణ

ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ఓప్స్ ర్యాంప్ సీఈవో (CEO) వర్మతో సమావేశమయ్యారు, ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు, అంతేకాకుండా, ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, ఆర్ & డి సహకారం కోసం ఏపీ టెక్ అకాడమీయాతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. స్కేలబుల్ ఎస్ఏఎస్ మోడల్స్ ద్వారా ఐటీ కార్యకలాపాల నిర్వహణతో పాటు ఏపీలో ఎస్ఎంఈలు (SMEs) మరియు స్టార్టప్‌లను ప్రారంభించాల్సిందిగా కూడా మంత్రి లోకేష్ కోరారు.

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ స్పందిస్తూ, తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా కస్టమర్లు ఉన్నారని, ఇందులో ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీతో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయని తెలిపారు, భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్‌లో తాము ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వర్మ పేర్కొన్నారు.

సెలెస్టా వీసీతో చర్చలు: డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్

అంతకుముందు, అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు, విశాఖపట్నం ఐటీ మరియు డేటా హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు, సెమీకండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు, పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు లోకేష్ తెలిపారు. సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్, తాము ప్రధానంగా యూఎస్, ఇండియా, ఇజ్రాయెల్-ఆగ్నేయాసియా దేశాలపై దృష్టిసారిస్తున్నామని, సెమీకండక్టర్లు, ఏఐ/ఎంఎల్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్ (SaaS), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్‌ప్రైజింగ్ సాఫ్ట్‌వేర్, గ్లోబల్ మార్కెట్లను అనుసంధానించే స్టార్టప్‌లలో పెట్టుబడులకు తాము ప్రాధాన్యతనిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

ఇతర ముఖ్య సమావేశాలు

మంత్రి లోకేష్ ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో భేటీ అయ్యారు, ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకారం అందించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు, అనంతరం శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్రెడ్డితో సమావేశమై, ఏపీలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు, ఆర్ స్కాలర్ (R Scholar) పిని చౌదరితోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

attracting investments CEO meetings Digital Governance electronics manufacturing clusters Google News in Telugu IT infrastructure modernization Latest News in Telugu Minister Nara Lokesh OpsRamp CEO Verma San Francisco smart cities AP Telugu News Today us tour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.