ఏపీ (AP) డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయులైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సైన్సె’ లోని ‘ టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ సందర్బంగా, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Read also: AP: రేపు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం
“పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. ఈ సందర్భంగా ఆయనకు మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి” అని కొనియాడారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: