ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 జూలైలో ప్రారంభమైన మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPM Urban Poverty Alleviation Agency)ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పట్టణ పేదలకు స్వయం ఉపాధి, సాధికారత కల్పించడంలో మెప్మా కీలకంగా మారింది. ఇటీవల నిర్వహించిన స్కాచ్ అవార్డుల కార్యక్రమంలో మెప్మా కీలక స్థానం దక్కించుకుంది.ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థ వివిధ రంగాల్లో 14 ప్రాజెక్టులు నామినేట్ చేయగా, అందులో తొమ్మిది ప్రాజెక్టులకు స్కాచ్ ప్లాటినం అవార్డులు (Scotch Platinum Awards) లభించాయి. ఇది రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు మెప్మా చేస్తున్న కృషి ఫలించినట్టు ఈ అవార్డులు నిరూపించాయి.
ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే ప్రాజెక్టులు
నివాసం, బ్యాంక్ లింకేజ్, లైవ్‌లీహుడ్ ట్రాకర్, ఈ-కామర్స్ అమ్మకాలు, స్కిల్ డెవలప్మెంట్, జీవనోపాధి యూనిట్లు, వీధి వ్యాపారుల అభివృద్ధి వంటి పథకాలపై మెప్మా దృష్టి పెట్టింది. ప్రత్యేకించి ‘ప్రేరణ సఖి’ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో స్కాచ్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఈ అవార్డులను స్వీకరించనున్నారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన ఘట్టమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం చంద్రబాబుకు, మంత్రి నారాయణకు కృతజ్ఞతలు
అవార్డు దక్కిన తర్వాత తేజ్ భరత్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ మద్దతుతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు.నగరాల్లో నివసించే పేద మహిళలకు పొదుపు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మెప్మా పని చేస్తోంది. ఈ అవార్డులు ఆ సంస్థకు మరింత నమ్మకం, ప్రోత్సాహం ఇచ్చేలా ఉన్నాయి.
Read Also : Goa CM : ప్రభుత్వ డాక్టర్‌కు తప్పిన సస్పెన్షన్ ముప్పు