ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ-2025 తుది ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రక్రియలో మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి.
ఫలితాలు విడుదల – అభ్యర్థులు ఎక్కడ చూడాలి?
మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి (M.V. Krishna Reddy)ప్రకటించిన ప్రకారం, అభ్యర్థులు తమ తుది ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ లో చూడవచ్చు.ఈ వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డులూ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఫలితాల నార్మలైజేషన్ ప్రక్రియతో
ఈ తుది ఫలితాలు సవరించిన కీ ఆధారంగా, అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తూ సిద్ధం చేయబడ్డాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, తాము రాసిన పేపర్లు, టెట్ మార్కులు (TET marks), క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోగలరు.
ఫలితాలు తెలుసుకోవడం ఎలా?
- ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో ఉన్న “Mega DSC 2025 Results” లింక్‌పై క్లిక్ చేయాలి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా విశ్లేషణ – విస్తృతంగా నిర్వహించిన డీఎస్సీ
ఈ రిక్రూట్‌మెంట్‌కు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకూ 23 రోజుల పాటు, రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించబడ్డాయి. పరీక్ష కేంద్రాలు ఏపీతో పాటు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. ఈ మెగా పరీక్షకు 92.90% హాజరు శాతం నమోదైంది.
టెట్ మార్కులలో ఎలాంటి తప్పులు ఉన్నా, అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ సదుపాయం 2025 ఆగస్టు 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: